కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్
అక్టోబర్ 06
కామారెడ్డి జిల్లా మంత్రి హరీష్ రావు బిచ్కుంద మండల కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో పెద్ద కొడప్గల్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను స్థానిక పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రుల పర్యటన ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్టు చేయడం సరికాదని అన్నారు. కార్యక్రమంలో నాయకులు మాధవరావు, శ్రీనివాస్ గౌడ్, సూర్యకాంత్, తదితరులు ఉన్నారు.
