కీర్తి శేషులు తాండా మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభం
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 14 మర్కుక్
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం సామాజిక కార్యకర్త తండా బాలకృష్ణ గౌడ్ జన్మదినం పురస్కరించుకొని తన మాతృమూర్తి తండా బుచ్చమ్మ మరియు ఎంపీపీ పాండు గౌడ్ , జెడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి,తాజా మాజీ సర్పంచ్ తిరుమల రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షుడు కనకయ్య గౌడ్ చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలకృష్ణ గౌడ్ సమాజ సేవలో తనవంతు పాత్ర పోషిస్తూ వారి జన్మదినం సందర్భంగా బాలకృష్ణ తండ్రి తాండ మల్లయ్య గౌడ్ జ్ఞాపకార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు. అలాగే బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ సేవ చేయడం లో తృప్తి ఉంటుందని నా జన్మదినం సందర్భంగా మా తండ్రి కీర్తి శేషులు మల్లయ్య జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో తండా బాలకృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు
