అక్టోబర్ 6 మంచిర్యాల జిల్లా:
మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు తాను అవినీతికి పాల్పడలేదని ఆయన పూజించే సాయి బాబా పై గుడిలో ప్రమాణం చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంచిర్యాల మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు రావుల ఉప్పలయ్య సవాల్ చేశారు.
శుక్రవారం మంచిర్యాల లోని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉప్పలయ్య మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, అభివృద్ధి పనుల్లో కమీషన్లు తీసుకోలేదా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే పై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఏసీసీ పక్కన ప్రభుత్వ భూమి ఎమ్మెల్యే తండ్రి పేరు తో రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాగా ఇప్పటి వరకు ఆ చర్యకు ఎవరు పాల్పడ్డారో ఎందుకు వెలుగులోకి రాలేదని ఆయన నిలతీశారు.
మంచిర్యాల లో అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. ప్రజలకు అవసరమయ్యే ప్రతి పనిలో తాము సహకరింఛామని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఎక్కడ దౌర్జన్యం, అన్యాయం చేసాడో నిరూపించాలని సవాల్ చేశారు. వ్యాపారులను బెదిరించాడని బీఆరెస్ చేస్తున్న ఆరోపణలను వ్యాపారస్తులు విశ్వసించడం లేదని అన్నారు.
నీ కుమారుడు విజిత్ రావు రాజ్యాంగెతర శక్తిగా నియోజకవర్గ ములో అనధికార అధికారం చాలాయిస్తున్నాడని ధ్వజమెత్తారు. గతంలో ఏఎస్పీ విజయ్ కుమార్ విజిత్ రావును హెచ్చరించైనా మాట వాస్తవం కాదా అని ఆయన అన్నారు. బీజేపీ ఆందోళన చేస్తే అక్కడకు వెళ్లి దాడులు చేయండి అంటూ పార్టీ శ్రేణులను ఆదేశించింది వీడియోలు ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే స్టిక్కర్ కారుకు అంటించుకుని తిరిగితే ఓ పోలీస్ అధికారి అడ్డుకుని స్టిక్కర్ తొలగించలేదా అని ప్రశ్నించారు. రౌడీలు గుండాలను మీ చుట్టూ పెట్టుకుని కాంగ్రెస్ పై నిండారోపణలు చేయడం తగదని హితవుపలికారు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కరోజు కూడా జై తెలంగాణ అనని ఎమ్మెల్యే ఉద్యమకారులను అణచివేస్తున్నాడని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి పై కాంగ్రెస్ నేతలు ఎవరు ఆరోపణలు చేయలేదని ఉప్పలయ్య వివరణ ఇచ్చారు. హమాలివాడ విస్తరణ పేరుతో ఇండ్లు కూల్చి సామాన్య ప్రజలకు అన్యాయం చేశారని మున్సిపల్ ప్రతిపక్ష ఉప నాయకుడు మజీద్,ఎస్సిసెల్ జిల్లా అధ్యక్షుడు, కౌన్సిలర్ రామగిరి భానేశ్,మహిళ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షురాలు గజ్జెల హేమలత అన్నారు. బీఆరెస్ నేతల ఇండ్లు, స్థలాలు రోడ్ విస్తరణ లో పోతాయని ఉద్దేశ్యంతో రోడ్ విస్తరణ చేయడం లేదని విమర్శించారు.
ఈసమావేశంలో మున్సిపల్ కౌన్సిలర్ లు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
