అక్టోబరు 6 ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డా. ఉదారి చంద్రమోహన్ గౌడ్ ఆద్వర్యం లో స్థానిక ఐబీ చౌరస్తా యందు గల అంబేద్కర్ విగ్రహం నందు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ సమావేశం లో జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గౌడ్ మాట్లాడుతూ ఇటీవల విడుదలయిన కానిస్టేబుల్ ఫలితాలలో బీసీ అభ్యర్థులకు అన్యాయం జరిగింది . ఈ డబల్యు యు కోటా వల్ల 5% లేనటువంటి ఓసీ లకు 10% కల్పించడం ద్వారా బీసీలకు విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నదని
రానున్న రోజులలో బీసీ లు కూడా ఓసీ లు గా పరిస్థితి వస్తుంది అన్నారు మరియు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలి అన్నారు.
అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్ రావు మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు మా వంతు వాటా ప్రకటించాలని మరియు రానున్న రోజులలో జాతీయ వ్యాప్తంగా ఉన్న మహిళా ప్రతినిధులతో హైదరరాబాద్ లో సభను ఏర్పాటుచేసి రిజర్వేషన్ పై స్పష్టమైన హామీ వచ్చేవరకు పోరాటం కొనసాగుతుందని మరియు మంచిర్యాల టికెట్ బీసీలకు కేటాయించాలని అందుకోసం పోరాటం కొనసాగిస్తున్నామన్నారు.
ఈ సమావేశం లో జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ చారి , యువత ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్ , యువత ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ , మోహన్ కృష్ణ , శేఖర్ , రాజేష్ , వంశీ , మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
