ముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 26 ఆర్టీసీ హెయిర్ బస్ డ్రైవర్ అసోసియేషన్ సిరిసిల్ల డిపో కరీంనగర్ రీజినల్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజు ఆధ్వర్యంలో సిరిసిల్ల డిపో మేనేజర్ కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆర్టీసీ ఎయిర్ బస్సుల రీజినల్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజు మాట్లాడుతూ దాదాపు 15 సంవత్సరాల నుండి మేము ఆర్టీసీ సంస్థకు ఎనలేని సేవలు చేస్తున్నామని ఆర్టీసీ వారితో మమ్ములను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మీద్వారా ఈరాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము కానీ మాకు ఆర్టీసీ ఉద్యోగుల్లో విలీనం చేయాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. మీద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము సమ్మె కాలంలో పై అధికారుల ఆదేశాల మేరకు మేము డ్యూటీలు చేసి ప్రజలకు ఇబ్బంది కలవకుండా చూసామని గుర్తుచేస్తూ మాయందు దయ తలచి మమ్ములను కూడా ఆర్టీసీ వారితో సమానంగా ప్రభుత్వంలో విలీనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రమేష్, కోశాధికారి పిట్టల నరేష్, ప్రధాన కార్యదర్శి ముఖ్య శీను, గజం నరేంద్రబాబు, రామచంద్రం, కిషన్, అనిల్, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, దేవరాజ్, రాజు, లింగారావు, భాస్కర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
