ఆధ్యాత్మికం

హిందువులను ఏకం చేసేందుకే శౌర్య జాగరణ యాత్ర

145 Views

దౌల్తాబాద్: హిందువులను ఏకం చేయడానికే శౌర్య జాగరణ యాత్ర నిర్వహిస్తున్నామని యాత్ర కోఆర్డినేటర్ ధనుంజయ్ అన్నారు. బుధవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ ధళ్ ఆధ్వర్యంలో శౌర్య జాగరణ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా మంచి మార్గంలో నడవాలని జాగృతి పరిచేందుకే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు. అయోధ్యలోని రామ మందిరం నిర్మాణంలో హిందువులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశ సంస్కృతిని దెబ్బతీయడానికి విద్రోహశక్తులు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజు, మహేష్, కృష్ణంరాజు, స్వామి గౌడ్, అరుణ్, శ్రీనివాస్, కుమ్మరి నర్సింలు, స్వామి, నర్సింలు, విజయ, నవ్య, శ్రీనివాస్, స్వామి తదితరులు పాల్గొన్నారు…

No Slide Found In Slider.

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *