భవన నిర్మాణ కార్మిక గర్జనను జయప్రదం చేయండి
కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్
అక్టోబర్ 4
సిద్దిపేట జిల్లా చేర్యాల : భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 8న జనగామ ప్రిస్టన్ గ్రౌండ్ లో జరిగే భవన నిర్మాణ కార్మికుల గర్జన సభను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె అశోక్ పిలుపునిచ్చారు. బుధవారం ఈమేరకు చేర్యాల పట్టణంలోని కార్మిక సంఘం కార్యాలయంలో కార్మిక గర్జన సభ వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లేబర్ కార్డు రెన్యువల్ ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాలకు పెంచాలని, పెండ్లి, డెలివరీ కేసులకు ఇస్తున్న 30 వేల ఆర్థిక సాయాన్ని కళ్యాణ లక్ష్మి మాదిరిగా ఒక లక్ష రూపాయలకు పెంచాలన్నారు. సహజ మరణానికి లక్ష 30 వేల నుండి 5 లక్షలకు పెంచాలని, తోటి గీతా, నేత కార్మికులకు ఇచ్చే విధంగా 50 సంవత్సరాలు నిండిన ప్రతి భవన నిర్మాణ కార్మికునికి 6వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు. లేబర్ కార్డును 60 సంవత్సరాల నుండి 75 సంవత్సరాల వరకు వయస్సు పొడిగించాలని, భవన నిర్మాణ కార్మికులకు ప్రోత్సాహంగా కార్మిక బంధు వర్తింపజేసి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కల్పించాలని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికుల అందిస్తున్న సంక్షేమ పథకాలు హమాలీ కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.
ఈ డిమాండ్ల సాధనకై ఈనెల 8న ఛలో జనగామ భవన నిర్మాణ కార్మికుల గర్జన సభకు చేర్యాల ప్రాంత కార్మికులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఈరి భూమయ్య, జంగిలి యాదగిరి, వలబోజు నర్సింహా చారి, గజ్జల సురేందర్, కొమ్ముల విజయ, తిగుల్ల కనకయ్య, బండారి సిద్దయ్య, ఎగుర్ల ఎల్లయ్య, సిద్దిరాం భద్రయ్య, బంగారు ప్రేమ్ కుమార్, గౌండ్ల కొండయ్య, వెలుగల యాదగిరి, తిగుల్ల రాకేష్, అందె కిరణ్, కోడూరి వెంకటేష్, రాములు, రాజయ్య, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
