*రామగుండం పోలీస్ కమీషనరేట్*
*పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిది లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తి పట్టివేత*
*గంజాయి పండించిన, తరలించినా, అమ్మిన సేవించిన వారి పైన కఠీన చర్యలు తప్పవు- పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ*
పోత్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఈరోజు గంజాయి కేసు లో నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించడానికి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పెద్దపల్లి ఏసీపీ జి. కృష్ణ కేసు, అరెస్ట్ వివరాలను వెల్లడించారు.
*పట్టుబడిన నిందితుని వివరాలు:-*
A1. కంసాని అరుణ్ తండ్రి పేరు రవి వయసు 20 సంవత్సరాలు కులం దొమ్మర వృత్తి హమాలి నివాసం సుభాష్ నగర్ హుస్నాబాద్ గ్రామం
*పరారిలో ఉన్న నిందితులు:-*
A2. బొల్లెద్దు మహేందర్ s/o రమేష్, 24 సంవత్సరాలు, SC మాల, Occ ప్రైవేట్ ట్రావెల్స్, r/o 4-62, 21PIT, రొంపైడ్, బద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు,
A3. చీమల ఆకాష్ s/o బాబు రావు, 19 సంవత్సరాలు, ST కోయ, Occ డ్రైవర్, బద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన r/o ఇల్లందు ,
*స్వాధీనం చేసుకొన్నా వాటి వివరాలు..*
4.098 కిలోల ఎండు గంజాయి, దాని విలువ రు. 2,04,000 /- .
ఒక కార్
ఒక మొబైల్ ఫోన్
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధి లోని పెద్దపల్లి జోన్, పెద్దపల్లి సబ్ డివిజన్, సుల్తానాబాద్ సర్కిల్ లో గల పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గౌరవ రామగుండము పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ పెద్దపల్లి పి. కరుణాకర్ ఆద్వర్యం లో, ఎసీపీ పెద్దపల్లి శ్రీ జి.కృష్ణ, ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, సుల్తానాబాద్ జి. సుబ్బారెడ్డి పర్యవేక్షణ లో ఈ రోజు అనగా తేది 12-09-2025, రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్, పెద్దపల్లి సబ్ డివిజన్, సుల్తానాబాద్ సర్కిల్ లో గల పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల పొత్కపల్లి గ్రామ శివారులో గల లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ ముందు SI పోత్కపల్లి దీకొండ రమేష్ వెహికల్స్ చెకింగ్ చేస్తుండగా ఒక కారు లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనబడగా మమ్మల్ని చూసి ఆ కారు లో ఉన్న వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా అతన్ని పట్టుకోని అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా వారు గంజాయి అమ్మడానికి వచ్చినట్టు తెలియ చేయగా అతన్ని వద్ద ఉన్న గంజాయిని చూపించగా అది 4.098 కిలోల ఎండు గంజాయి గా ఉంది, అట్టి గంజాయిని మరియు ఒక కార్, ఒక మొబైల్ ఫోన్ లు స్వాధీనం చేసుకుని నిందితుని పై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు.
*వివరాల్లోకి వెళ్తే…*
కంసాని అరుణ్ s/o రవి, 20 సం,, దొమ్మర కులం, డ్రైవర్ మరియు టైల్స్ వర్కర్ r/o హుస్నాబాద్, సిద్దిపేట జిల్లా. మరియు నేను కారు డ్రైవర్ గ పని చేస్ద్తున్నాడు అదేవిధంగా టైల్స్ వర్క్ చేస్తాడు , గంజాయి తాగడానికి బానిస అయ్యి మరియు అట్టి గంజాయి ని అమ్ముకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నాను డ్రైవర్ అండ్ టైల్స్ వర్క్ చేస్తే వచ్చే డబ్బులు సరిపోక ఎలాగైనా డబ్బులు సంపాదించాలనే చెడు ఉద్దేశ్యం తో నేను గంజాయి అమ్ముకుని త్వరలో ఎక్కువగా సంపాదించు కోవాలని నిర్ణయించుకొని ఆ క్రమం లో నిందితునికి కార్ డ్రైవింగ్ లో బోలెద్దు మహేందర్ s/o రమేష్, 24సం, SC మాల, r/o ఇల్లందు, బద్రాద్రి కోతగుడెం జిల్లా మరియు చీమల ఆకాష్ s/o బాబు రావు, 19 సం , ST కోయ r/o ఇల్లందు, బద్రాద్రి కోతగుడెం జిల్లా, లు పరిచయం అయ్యారు వారు ఓడిస్సా రాష్ట్రము లోని గుర్తు తెలియని వ్యక్తి దగ్గర నుంచి గంజాయి ని తక్కువ ధరకు కొనుక్కుని వచ్చి బయట ఎక్కువ ధరకు అమ్ముకుంటారు, అట్టి పరిచయం తో నిందితుడు కూడా వారితో కలిసి అప్పుడప్పుడు గంజాయి స్మోక్ చేస్తూ వారితో పాటు గంజాయిని అమ్మే వాణ్ణి, తర్వాత నేను కూడా నా సొంతంగా గంజాయిని కొని ఆ కొనుగోలు చేసిన గంజాయి ని బయట అమ్ముకుంటే ఎక్కువ లాభం తో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అనుకోని, మహేందర్ మరియు ఆకాష్ ల దగ్గర గంజాయిని కొని హుస్నాబాద్, కరీంనగర్, గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తనాబాద్, ఓదేల ప్రాంతాలలో కాలేజీ విద్యార్తులు మరియు అవసరం ఐన వ్యక్తులకి కిలో కి 50,000/- చొప్పున అమ్ముకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అదేవిధంగా ఇంకా బయట ఎక్కువ గంజాయిని అమ్ముకుంటే ఎక్కువ లాభం వస్తుందని, మహేందర్, ఆకాష్ ల దగ్గర ఇల్లందు లో 5 కిలోల గంజాయి ని 40,000/- రూపాయలకు (ఒక కిలోకి 8,000/-) కొని హుస్నాబాద్ కి మా యొక్క ఎర్టిగా కారు B.No TS-36-Q-3071 లో కొనుగోలు చేసిన గంజాయితో ఎవరికీ దొరకకుండ హుస్నాబాద్ కి వచ్చినాడు, కొన్న గంజాయిని కొంత హుస్నాబాద్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో గుర్తుతెలియని వ్యక్తులకు అమ్ముకున్నాను, మిగిలిన గంజాయిని బయట ఓదెల, పెద్దపల్లి మరియు చుట్టూ ప్రాంతాలలో అమ్ముకున్ధమనుకొని వస్తుండగా పోలీస్ వారు ఇక్కడ పట్టుకున్నారు. పోత్కపల్లి పోలీస్ వారు కారు డిక్కీలో ఉన్న గంజాయిని మరియు నేరానికి ఉపయోగించిన ఎర్టిగా కార్ ను మరియు గంజాయి అమ్మడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్ లను స్వాదినపర్చుకున్నారు.
అక్రమ రవాణా చేస్తున్న గంజాయి, నిందితున్ని పట్టుకున్న సుబ్బా రెడ్డి, సీఐ సుల్తానాబాద్, ఎసఐ దీకొండ రమేష్ సిబ్బంది అయిన ASI రత్నాకర్, PC రాజు యాదవ్, హరీష్, రాము, శివశంకర్, రాజేందర్, రాజు,రమేష్, లను ఏసీపీ గజ్జి కృష్ణ అభినదించారు.





