వర్గల్ మండల్ అక్టోబర్ 4 :సింహ గర్జన ర్యాలీ కి తరలిన వర్గల్ మండల ముదిరాజులు.
చట్టసభల్లో తమకు సముచిత న్యాయం ఇవ్వాలని,10 వేల కోట్లతో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని పలు డిమాండ్ల తో గజ్వేల్ పట్టణంలో జరిగే ముదిరాజుల సింహ గర్జన ర్యాలీకి వర్గల్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు శ్రీరామ్ నర్సింలు, ముదిరాజ్ అధ్వర్యంలో ముదిరాజులు భారీ ఎత్తున బయలుదేరారు.
తమ హక్కుల సాధన కోసం మహా గర్జన భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో నియోజకవర్గం నుండి సుమారుగా 30 వేల మంది ముదిరాజులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన మాకు బీసీ (డి) నుండి బీసీ (ఏ) లోకి మార్చాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ మత్స్యకార సంపద కల్పించాలని అన్నారు.
రాష్ట్రం లో ముదిరాజులు అణచివేతకు గురుతున్నరని, రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బీసీ బందు పథకంలో కూడా తమకు స్థానం కల్పించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మా జనాభా ప్రకారం మాకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ లో జరుగనున్న భారీ బహిరంగ సభలో మా ఐక్యత ప్రభుత్వానికి చూపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పసుల రమేష్ ముదిరాజ్, పసుల లింగం ముదిరాజ్, ఎల్కంటి వెంకటేశ్ ముదిరాజ్, నెంటూర్ నాగరాజు, జెల్ల మల్లేష్ ముదిరాజ్, మండల అన్ని గ్రామ ముదిరాజ్ సంఘాల అద్యక్షులు తదితరులు పాల్గొన్నారు




