అక్టోబర్ 4
విమాన ప్రమాదంలో భారత వ్యాపారవేత్త మృతి జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో భారత మైనింగ్ వ్యాపారవేత్త హర్వాల్ రణావా ఆయన కుమారుడు అమర్ దుర్మరణం చెందారు. ప్రైవేటు విమానంలో హారారే నుంచి మురోవా వజ్రాల గనికి వస్తుండగా సాంకేతిక లోపం తలెత్తి విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం ఆరుగురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. రణ్ వా రూ.33 వేల కోట్లకుపైగా ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జెమ్ హోల్డింగ్ వ్యవస్థాపకుడు.




