అక్టోబర్ 03 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
చెన్నూర్ నియోజకవర్గం కోటపెల్లి మండల్ రాపెనపెల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన దుర్గం రాజయ్య మరణించగా వారి కుటుంబం యొక్క ఆర్థిక పరస్థితి బాగులేక ఇబ్బంది పడుతున్నారని స్థానికులు చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి దుర్గం అశోక్ కి తెలియజేయగా వారు వెంటనే స్పందిచి ధశదినకర్మ కార్యక్రమానికి 50 కేజీ ల రైస్ పంపించగ దుర్గం అశోక్ యువసేన సభ్యులు గోదారి సంతోష్, అట్టెల రాజేందర్, గోదారి సడువలయ్య, అట్టేల లస్మయ్య, డొంగిరి మల్లేష్, దుర్గం మహేందర్, దుర్గం సమ్మయ్య మరియు గ్రామస్థులు మృతుని ఇంటికి వెల్లి వారి కుటుంబానికి అందజేయడం జరిగింది.
అది చూసిన అక్కడి ప్రజలు ఏపదవి లేకుండానే ఇలా వేలమంది పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు ఇలాంటి మంచి మనసున్న సేవకుడే నాయకుడు ఐతే ఇంకా వేలమంది పేద మధ్యతగతి కుటుంబాలకు మంచి జరుగుతుంది కనుక ప్రజలతో సంబందం లేని ఏవ్యక్తిని కూడ వేరే నియోజకవర్గాల్లో గెలిపించనే గెలిపించరు కనుక మనం కూడ ఇక్కడ? ఎవరో ముక్కు మొహం తెలియని వారిని కాకుండా, అందరికి అందుబాటులొ ఉంటూ సౌమ్యంగా మాట్లాడుతూ, కోపతపాలు బెదిరింపులు లేకుండా మనకుటుంబంలో మనలో ఒకడిగా కలసి ఉంటున్న దుర్గం అశోక్ నే ఎమ్మెల్యే గెలిపించు కోవాలని చర్చించు కుంటున్నారు.
అనంతరం మృతుడి కుటుంబ సబ్యులు మాట్లాడుతూ మాకుటుంబ పరిస్థితి గురించి స్థానికులు చెప్పిన వెంటనే స్పందించి సహయం అందించిన దుర్గం అశోక్ కృతజ్ఞతలు అని తెలియజేశారు.






