Breaking News

మోడీ ప్రభుత్వ విధానాలు నశించాలి…

80 Views

మోడీ ప్రభుత్వ విధానాలు నశించాలి…

సెప్టెంబర్ : కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం నూటికి 90 శాతం గా ఉన్న పేద మధ్యతరగతి ప్రజల పై అనేక భారాలు మోపుతున్నాడని ఉన్నత వర్గాలకు కార్పొరేట్ బడా భూస్వాములకు దేశ సంపదను కొల్లగొట్టే విధంగా వ్యవహరిస్తున్నదని ఈ చర్యలు వెంటనే మానుకొని నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయాలని చేర్యాల సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యుడు గొర్రె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం రోజున మండలంలోని సుంచనకోట గ్రామంలో మోడీ ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గొర్రె శ్రీనివాస్ మాట్లాడుతూ పెంచిన ధరలను తగ్గించాలని, ప్రైవేటీకరణను నిలిపివేయాలని, విద్యా, వైద్యాన్ని ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా అందించాలని, బిజెపి నరేంద్ర మోడీ పాలనలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయిందని ఉపాధి లేక ప్రజలు అల్లాడుతున్నారని ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా కుట్రలు పన్నుతున్నారని ప్రభుత్వ రంగ సేవలను ప్రభుత్వంగా ఆస్తులను కార్పోరేట్లకు కట్టబెట్టుతున్నారని మోడీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలను వెంటనే మానుకొని నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేసే రకంగా చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా పేద మధ్యతరగతి ప్రజలను, కార్మికులను రైతులను ఏకం చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పండుగ యాదగిరి, భీమరాజు, గుంటి కనకయ్య, కొమ్ము బాలయ్య ,గుడ్ల మైసయ్య, బింగి రాజు, తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *