కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన
మండలపార్టీ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి
ఎంపీపీ తాండ పాండు గౌడ్
జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం
అక్టోబర్ 3
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సహకారం తో మర్కూక్ మండలం పాతూర్ గ్రామానికి చెందిన కొక్కొండ అనూష, రుద్రారం పూజ, భూకల మనిషా,భూకల మౌనిక, ఉప్పరి నవనీత కల్యాణ లక్ష్మీ పథకం కింద బిఆర్ఎస్ మండలపార్టీ అధ్యక్షుడు మర్కూక్ కరుణాకర్ రెడ్డి, ఎంపీపీ తాండ పాండు గౌడ్, జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, తహసీల్దార్ చంద్ర శేఖర్ ,బిఆర్ఎస్ నాయకులు భాస్కర్, శ్రీను, సంతోష్ రెడ్డి, మహేష్ ,కరుణాకర్ శ్రీను మీదగా అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఆడబిడ్డకు 18 ఎళ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలని సూచించారు. గ్రామాలలో నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు కల్యాణ లక్ష్మి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, షాదీ ముబారక్ కింద మైనార్టీల యువతుల వివాహాలకోసం లక్షా 116 రూపాయలు అందజేస్తుందన్నారు. దేశంలోనే గతంలో కూడా ఏ ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేయలేదని, కేవలం కేసీఆర్ సర్కార్ మాత్రమే అమలు చేసిందని అన్నారు.





