కథనాలు

గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యం ఇదేనా..?

168 Views

 

తెలంగాణ సాదించుకున్న తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ ఊరూరా బెల్టు షాపులు తెరిచి మహిళల ఉసురు  తీస్తుందని,  గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం అంటే బెల్టు షాపులు తెరవడమెనా అంటూ కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.  గాందీ జయంతి పురస్కరించుకొని  తొగుట మండల కేంద్రంలో సోమవారం గాందీ విగ్రహానికి పూల మాల వేసి సత్యాగ్రహ దీక్ష లో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏ గ్రామంలో చూసినా విచ్చల విడిగా బెల్టు షాపులు తెరిచి పేద, మధ్యతరగతి కుటుంబాల జీవితాలు చిద్రం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పాలనను కొనసాగిస్తున్నారని,  బంగారు తెలంగాణా లో అర్ధ రాత్రి పాలు దొరకవు కానీ మద్యం మాత్రం విరివిగా లభిస్తుందని, క్వాటర్ సీసా దొరకడానికి పగలు రాత్రి తేడా లేదని, బెల్టు షాపులకు తలుపులు బార్లా తెరిచి ఉంచుతున్నారాని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో మద్యానికి బానిసైన వ్యసనపరులు మహిళలు తాళిబొట్టు అమ్ముకొనే దుస్థితి నెలకొందని, దేశానికి దిశ దశ చూపాల్సిన నేటి యువత  మద్యం మత్తులో  మునిగి తేలేలా వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని, ఇదేనా ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పిన బంగారు తెలంగాణ అని ప్రశ్నించారు. ప్రజల  బ్రతుకులను మద్యం మత్తులో  చిత్తు చేస్తున్న బిఆర్ఎస్ పార్టీ ని బొంద పెట్టే రోజులు దగ్గర పడ్డాయని, మహిళలు కేసీఆర్ ప్రభుత్వం పై విసిగి వేసారి పోయారని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో తొగుట ఎంపిపి గాంధారి లతా నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు ఆక్కం స్వామి, టి పి సి సి ఫిషర్ మెన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేపాక తిరుపతి ముదిరాజ్, ఐఎన్టీయూసీ దుబ్బాక నియోజకవర్గం అధ్యక్షులు చిక్కుడు బాలమల్లు, నాయకులు మహిపాల్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, భూపాల్ రెడ్డి , విజయ్ రెడ్డి, విజయపాల్ రెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు లింగాల కృష్ణ, కిసాన్ సెల్ అద్యక్షుడు సిద్ది శ్రీనకర్ రెడ్డి, కాసర్ల నర్సింలు, ఉప్పలయ్య, తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
శ్రీరామోజు శేఖర్ Ts24/7 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *