మర్కుక్ మండల పరిషత్ కార్యాలయంలో ఘనంగా బాపూజీ జన్మదిన వేడుకలు
కార్యక్రమానికి హాజరై గాంధీ చిత్ర పటానికి నివాళులు అర్పించిన మండల పరిషత్ అధ్యక్షులు మండల ప్రజా ప్రతినిధులు
అక్టోబర్ 02 మహాత్మా గాంధీ జన్మదిన వేడుకలు మర్కుక్ మండల కేంద్రంలో మండల పరిషత్ కార్యాలయంలో మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా స్థానిక సర్పంచ్ భాస్కర్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం ఎంపీటీసీ ఫోరమ్ అధ్యక్షులు కృష్ణ యాదవ్ ఎంపీటీసీలు గోలి నరేందర్ ధనలక్ష్మి కృష్ణ ఎంపీవో రాజలింగం మండల బి ఆర్ ఎస్ నాయకులు తుమ్మల కనకయ్య మరియు మండల నాయకులు తదితరులు పాల్గొని మహనీయుని చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్బంగా ఎంపీపీ పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం లు మాట్లాడుతూ మహాత్మా భవిష్యత్ తరాలకు మార్గ నిర్దేశం చేసారని అంటరాని తనాన్ని అంతం చేయడానికి జన్మంతా పోరాటం చేసిన మహనీయులు గాంధీయని సత్యమేవ జయతే పిలుపుతో ప్రపంచమంతా మేల్కొలిపిన భారత బాపూజీయని భూమి ఉన్నన్ని రోజులు చరిత్ర సజీవమని తెలియజేశారు
