కె .టీ.ర్ ఆదేశాలనుసరంగా మా నాయకుడు తెలంగాణ కాంగ్రేస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొననున్న బి.ర్.ఎస్ నాకాయకులు ఎవరైతే ఉన్నారో మీరు నిజంగా రేవంత్ రెడ్డి మాట్లడిన ప్రసంగాన్ని మీరు విన్నారా ?.
వింటే అందులో మా నాయకుడు ఉచిత విద్యుత్ ఎత్తి వేస్తాం అనే మాట ఉందా?
అసలు రేవంత్ రెడ్డి అన్న మాటలు ఏమిటంటే కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అని చెప్పి రైతులను మోసం చేస్తున్నాడు.నిజంగా సన్నకారు చిన్నకారు రైతులకు 1 నుండి 3 ఏకరలలోపు ఉన్నవారే ఇంత విస్తీర్ణంలో పంట సాగుచేసుకునే వారికి 3 గంట నాణ్యమైన కారెంటును ఇస్తే సరిపోతాది అని ఆన్నడే తప్ప పూర్తిగా ఎత్తి వేస్తాం అని ఎక్కడ అనలేదు.నిజంగా మనమందరం పార్టీలు పక్కన పెట్టి గుండెల మీద చేయి చేసుకొని చెప్పండి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అవుతుందా? ఎవరు ఏమన్నా ఈ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ఇవ్వడంలేదు.మా ప్రభుత్వ హయాంలో మేము ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ సరఫరా చేసాము.రైతు పక్ష పతిగా మేము ఉన్నాము.నిజంగా ఈ ఉచిత కరెంట్ అనేది బి. ర్.ఎస్ ఎమ్మెల్యేలకు .ఎంపీ లకు సంభందించిన ఫౌంహౌజ్ లకి ఫ్యాక్టరీలకు మాత్రమే వెళ్తుంది.మీ ఎమ్మెల్యేలు ఎంపీలు కరెంటు బిల్లులు కట్టకుండా ఆ భారం ప్రజల పైన మోపుతున్నారు .ప్రజల నుండి మాత్రం బిల్లులు వసూలు చేస్తారు.ఇలాంటి చేర్యాల వలన 25 వేళ కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఉత్పత్తి చేసే సంస్థలకి అప్పు ఉంది నిజం కాదా? ఇంత వరకు విద్యుత్ ఉద్యోగులకి 1 తరికూన పడాల్సిన జీతాలు ఎందుకు ఎయ్యట్లేదు మరి మొత్తం రాష్ట్రాన్నీ అప్పుల కుప్పలో పడేసినారు. ఏ ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల కు సరి అయిన సమయంలో జీతాలు రావట్లేదు. ఇలాంటి పదాలను వక్రీకరించి ప్రజలను మభ్య పెట్టాలనుకుంటే ప్రజలు త్వరలోనే బి.ర్.ఎస్ పార్టీని బొంద పెడతారు.కేవలం కాంగ్రేస్ పార్టీ ఎదుగుదలను ఓర్వలేని ఈ ప్రభుత్వంఇలాంటి హీనమైన చర్యలకు పాల్పడడం సారి అయినది కాదు.రానున్నది కాంగ్రేస్ ప్రభుత్వమే రాష్ట్ర ప్రజలకు సంక్షేమం అందించేది కాంగ్రెస్ మాత్రమే అని కాంగ్రేస్ పార్టీ తరుపున హెచ్చరిస్తున్నాము.
ఇట్లు.
పోతగాళ్ల రవి.
వర్గల్ మండల దళిత కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడు.




