దేవరకద్ర అక్టోబర్ 1 :అక్టోబర్ 4 న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు దేవరకద్ర నియోజకవర్గంలో పర్యటనను విజయవంతం చెయ్యలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు
కొత్తకోట మండల ముఖ్య నాయకులు,మున్సిపల్ నాయకులతో విడివిడిగా సన్నాహక సమావేశం నిర్వహించిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
అక్టోబర్ 4 న మదనాపురం మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తారు.
కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో బారి ర్యాలీ మరియు 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి,దెవరకద్ర 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు కు కొత్తకోట లో శంకుస్థాపన చేయనున్నట్లు, మరియు సంకిరెడ్డి పల్లి బిటి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన,కొత్తకోట పట్టణంలో 9 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు.
కొత్తకోట లో 50 వేల మందితో భారీ భహిరంగ సభ ఉంటుందని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని, నియోజకవర్గ శ్రేణులకు పిలుపునిచ్చిన దెవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి.
ఈ కార్యక్రమాలలో మంత్రులు నిరంజన్ రెడ్డి , శ్రీనివాస్ గౌడ్ గారు,ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.




