(మానకొండూర్ సెప్టెంబర్ 30)
కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన గౌడ సంఘం ఎన్నికలు శనివారం రేణుక ఎల్లమ్మ ఆలయం లో నిర్వహించారు. గౌడ కులస్తులు అందరు కలిసి నూతన
అధ్యక్షునిగా ఏకగ్రీవంగా బొంగాని స్వామి గౌడ్ ను, ఉపాధ్యక్షులుగా అమరాగోని రామస్వామి ని, కోశాధికారి గా బత్తిని విరస్వామి ని ఎన్నుకున్నారు.
ఈ సందర్బంగా
అధ్యక్షులు స్వామి గౌడ్ మాట్లాడుతూ..
నాపై నమ్మకం తో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అభినందనలు తేలుపుతూ నేను ఎల్లవేళలా కుల సంఘనికి, సభ్యులకు నావంతు సేవ చేస్తానని అన్నారు.ప్రభుత్వం నుండి మనకు వచ్చే నిధులను సంఘ సభ్యులకు వచ్చే విదంగా అధికారుల దృష్టికి తీసుకెలుతానని అన్నారు.
ఈకార్యక్రమం లో నూతనంగా ఎన్నుకున్న కార్యవర్గ సభ్యులు, గౌడ కులస్థులు తదితరులు పాల్గొన్నారు.