–ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్.
(తిమ్మాపూర్ సెప్టెంబర్ 30)
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కార్యాలయం పై దాడికి పాల్పడిన ఎంఐఎం గుండాలను కఠినంగా శిక్షించాలని ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్ డిమాండ్ చేసారు.
కరీంనగర్ లో శుక్రవారం ఎంఐఎం కార్యకర్తలు ఎంపి కార్యాలయంపై దాడి జరిపిన సందర్బంగా శనివారం తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ రాజీవ్ రహదారి పై బీజేపీ కార్యకర్తలు ఎంఐఎం దిష్టి బొమ్మను దహనం చేసారు.
కరీంనగర్ లో బీజేపీ ఎదగకుండా బిఆర్ఎస్, ఎంఐఎం గుండాలు కలిసి ఆడుతున్న నాటకమే ఈ దాడులకు కారణమని ఆరోపించారు.రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలవకుండా బిఆర్ఎస్, ఎంఐఎం కలిసి కుట్రలు చేస్తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనిల్, గొట్టుముక్కల తిరుపతిరెడ్డి,ఉపాధ్యక్షులు పబ్బ తిరుపతి,బిజెవైఎం ప్రధాన కార్యదర్శి బొడ్డు అశోక్,కార్యదర్శి పడాల శ్రీనివాస్,దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి గాజుల అజయ్, బుర్ర శ్రీనివాస్, మాదిరెడ్డీ ప్రదీప్, బొడ్డు శ్రీనివాస్, రొంటాల జీవన్ రెడ్డి, కీసరి సంపత్, రేగూరి సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు.