రెండో విడత గొర్రెల పంపిణి పూర్తి చేయాలి
యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్
యాదవ సంఘం జిల్లా అధ్యక్షురాలు పుట్ట లావణ్య యాదవ్ ల డిమాండ్
సెప్టెంబర్ 30 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ జిల్లాపెళ్లి రాజేందర్:
మంచిర్యాల జిల్లాలో యాదవులు ఎదోర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్ , యాదవ సంఘం జిల్లా అధ్యక్షురాలు పుట్ట లావణ్య యాదవ్ లు డిమాండ్ చేశారు.
శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం సతీష్ యాదవ్, యాదవ సంఘం జిల్లా అధ్యక్షురాలు పుట్ట లావణ్య యాదవ్ లు మాట్లాడుతూ జల్లాలో రెండవ విడత గొర్రెల పంపిణి అస్తవ్యస్తంగా మారిందని ,యాదవులు ఒక్కో యూనిట్ కు రు.43,250 డబ్బులు చెల్లించి ఏళ్లు గడుస్తున్నా,ఇంత వరకు గొర్రెల యూనిట్ లు లబ్ధిదారులకు అందించ లేదని తెలిపారు.జిల్లాలో ,సుమారు 3 వేల మంది యాదవ లు గొర్రెల యూనిట్ లు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతం లో ప్రభుత్వం యాదవులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు.
యాదవుల సమస్యల పై బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మంత్రి కె టి ఆర్ మాట్లాడాలనీ వారు డిమాండ్ చేశారు.యాదవులకు ఇళ్ళ స్థలాలు ,డబుల్ బెడ్రూం ఇల్లు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం ,జిల్లా కేంద్రంలో ప్రత్యేక స్థలం కేటాయించాలన్నారు . గొర్రెల, మేకల పెంపకం దారుల కు ప్రత్యేక పెన్షన్ పథకం అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా నాయకులు ,యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు .
