ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి ఉమ్మడి మండలాల కు సంబంధించిన కుమ్మరుల సంఘం భవనం అర్దాంతరంగా ఆగిపోవడానికి వీలులేదు.నేను కుమ్మరి కులంలో పుట్టినందుకు నేను మన సంఘ భవనం కట్టించే బాధ్యత నేను తీసుకుంటాను అని ప్రముఖ ఎన్నారై రాధారపు సత్యం అన్నారు.ఎల్లారెడ్డిపేట మండలకేంద్రములో ఎల్లారెడ్డిపేట మరియు వీర్నపల్లి ఉమ్మడి మండలాలకు సంబంధించి కుమ్మరుల సంఘ భవనం నిర్మాణం పనులు అర్దాంతరంగా ఆగిపోగా మిగతా పనులు పూర్తి చేయడానికి గాను ప్రముఖ ఎన్నారై రాధారపు సత్యం భూమి పూజ చేశారు.సుమారు 20 లక్షల రూపాయల మేర తన స్వంత డబ్బులతో భవనం,చుట్టు ప్రహారిగోడ నిర్మాణం పనులు పూర్తి చేస్తానని సత్యం అన్నారు కుమ్మరి కులంలో పుట్టి చదువుకున్న వారు సంఘభవన నిర్మాణం కోసం సలహాలు సూచనలు ఇవ్వాలని సత్యం కోరారు..ఈ కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్షుడు రాదరపు శంకర్ ,దరిపెళ్లి రమేష్ తో పాటు 50 మంది కులసంఘ సభ్యులు పాల్గొన్నారు.




