సెప్టెంబర్ 29 మంచిర్యాల జిల్లా ప్రతినిధి జిల్లాపెళ్లి రాజేందర్:
మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలో ఉర్దూ మీడియం స్కూల్ వద్ద ఈరోజు జన్నారం ముస్లిం యూత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈద్ మిలాద్ ఉన్ నబి ,( మహమ్మద్ ప్రవక్త) పుట్టినరోజు సందర్భంగా దాదాపు 50 మంది యువకులు తలసేమియా , గర్భిణి స్త్రీలు వ్యాధి గ్రస్తులకు రహీమ్ బ్లడ్ డొనేషన్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు అబ్దుల్ రహీమ్ వారి సహకరంతో మంచిర్యాల్ బ్లడ్ బ్యాంక్ వారికి మరియు అమృత్ బ్లడ్ బ్యాంక్ వారికి రక్త యూనిట్స్ అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమం సందర్భంగా ముస్లిం యూత్ వెల్ఫేర్ సొసైటీ జన్నారం మండల అధ్యక్షులు మొహమ్మద్ నయీమ్ మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా సేవ కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఉచిత రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని వారన్నారు, మరియు రక్త దాతలను అభినందించారు.
ఈ కార్యక్రమంలో జన్నారం సర్పంచ్ గంగాధర్ గౌడ్, ఎంపిటిసి.రియాజుద్దీన్, మాజీ ఉపసర్పంచ్ అజహార్, వార్డ్ సభ్యులు అబ్దుల్ రఫీక్ , సాదుపాషా, రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ అబ్దుల్ రహీమ్ బ్లడ్ బ్యాంక్ సూపర్వైజర్లు టెక్నీషియన్లు, యూత్ సభ్యులు సల్మాన్ , సోహెల్, శ్రీనివాస్, అజ్మత్ ఖాన్, మజాహర్, మోహిత్, సలీం , ఆరిఫ్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు.
