మర్కుక్ : పాములపర్తి
28.09.2023
నారనాయి నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్
మర్కుక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన నారనాయి నర్సయ్య అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకున్న మర్కుక్ మండల పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ ) పాండు గౌడ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి కుటుంబ తక్షణ అవసరాల ఖర్చుల కొరకు 5000 రూపాయల నగదు సహాయాన్ని అందజేశారు. వారితో పాటుగా బీసీ సెల్ మండల అధ్యక్షులు మేకల కనకయ్య, చెక్కలి రాములు, మేర వెంకటేష్, మేకల శ్రీనివాస్, నేల పోచయ్య, దండు లక్ష్మయ్య లతో తదితరులు ఉన్నారు





