CMRF చెక్ అందజేసిన గ్రామ సర్పంచ్ మంజుల రమేష్, BRS పార్టీ మండల అధికార ప్రతినిధి చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్
బిజీ వెంకటాపూర్ గ్రామానికి చెందిన పోకల చంద్రమ్మ అనారోగ్యం కారణంగా హాస్పిటల్ లో అధిక డబ్బులు ఖర్చు కాగా గజ్వేల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్ రెడ్డి సహకారముతో సీఎం సహాయ నిధికి ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఏం ఎల్ సి డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి వద్ద అప్లై చేసుకోగా గ్రామ సర్పంచ్ మంజుల రమేష్,BRS మండల పార్టీ అధికార ప్రతినిధి చెక్కల పరమేశ్వర్ ముదిరాజ్ 24000 రూపాయల చెక్కు అందజేయడం జరిగింది లబ్దిదారురాలు సీఎం కెసిఆర్ కి, మంత్రి హరీష్ రావు కి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్ ,గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పోకల బాబు, నాయకులు వెంకటేష్ సురేష్ భాను తదితరులు పాల్గొన్నారు.
