సిద్దిపేట:సెప్టెంబర్ 28
24/7 తెలుగు న్యూస్
కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో పీ.డీ.ఎస్.యు-పివైఎల్ సంఘాల అధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వి.శ్రీకాంత్ మాట్లాడుతూ 1907వ సంవత్సరం పంజాబ్ లో విద్యావతి,సర్దార్ కిషన్ సింగ్ లకి జన్మించిన భగత్ సింగ్ చిన్ననాటి నుండే భారత స్వాంత్య్రోద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు.బ్రిటిష్ పాలకుల అరాచకాలు తీవ్రం చేస్తూ లాలలజపతి రాయ్ ని కొట్టి చంపడంతో భగత్ సింగ్ ప్రజల్లో విప్లవ కాంక్ష రగిలించే విధంగా అసెంబ్లీలో పొగ బాంబులు వేసి భారతీయుల సత్తా చాటడని కొనియాడారు. దేశ స్వాతంత్య్రం కోసం ,ప్రజల స్వేచ్ఛ, సమానత్వం కోసం నూనూగు మీసాల ప్రాయంలోనే ఉరికంబం ముద్దాడని అన్నారు.ప్రస్తుతం దేశంలో రోజురోజుకు ఆకలి, అసమానతలు,పేదరికం,నిరుద్యోగ సమస్యలు పెరిగి పోతున్నాయని ఆరోపించారు.భగత్ సింగ్ పోరాట స్ఫూర్తితో ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని యువతకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పి.వై.ఎల్ జిల్లా అధ్యక్షుడు కె.ఎస్.అనిల్,పీ.డీ.ఎస్.యు జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు మహేష్,విద్యానాథ్, ఇంజనీరింగ్ వింగ్ కన్వీనర్ సాయి కార్తిక్,కో కన్వీనర్ వంశీ,పట్టణ నాయకులు తిరుపతి,శ్రీధర్,మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
