చెరువులో నిమజ్జనం చేస్తున్న రసమయి బాలకిషన్
( మానకొండూర్ సెప్టెంబర్ 27 )
తొమ్మిది రోజులు విశేష పూజలు అందుకున్న గణపయ్య బుధవారం గంగమ్మ ఒడిలోకి చేరాడు. లంబోదరుడుని వెళ్ళిరా గణపయ్య.. మళ్ళీరావయ్యా.. అంటూ భక్తులు ఘనంగా వీడుకోలు పలికి నిమజ్జనం చేశారు. చివరి రోజు వినాయక మండపాల్లో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పలుచోట్ల వినాయకుడి లడ్డూ వేలంలో భక్తులు పోటిపడి దక్కించుకున్నారు. మండల పరిధిలోని గ్రామాలలో ఏర్పాటుచేసిన గణేష్ మండపాల నుండే కాకుండా జిల్లా కేంద్రమైన కరీంనగర్ నుండి మానకొండూరు పెద్ద చెరువు వద్దకు భారీగా గణేష్ విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు దీంతో ప్రధాన రహదారి చెరువు కట్ట ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శోభయాత్రలో మహిళల కోలాటాలు సాంస్కృతిక ప్రదర్శనలు యువత తీర్మాస్టెప్పులు చిన్నారుల నృత్యాలతో నిమజ్జన సంబరాలు అంబరానంటాయి. మానకొండూరు చెరువు కట్ట వద్ద భక్తులకు ఇబ్బందులు కలుగకుండా రెవెన్యూ మున్సిపల్ అగ్నిమాపక విద్యుత్ ఇతర శాఖల అధికారులు చర్యలు చేపట్టారు.చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన రెండు పెద్ద క్రేన్ల సాయంతో గణేష్ ప్రతిమలను భక్తులు నిమజ్జనం చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వ్యక్తి దీపాలు త్రాగునీరు భారీ కేట్లను ఏర్పాటు చేశారు. భారీ వినాయక విగ్రహాలను క్రేన్ సహాయంతో నిమజ్జనం చేశారు. వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా ఏసిపి కర్ణాకర్ రావు నేతృత్వంలో శ్రీ మాదాసు రాజకుమార్ ఆధ్వర్యంలో ఇద్దరు సిఐలు, ఇద్దరు ఎస్ఐలు,35 మంది పోలీసు బలగాలు, 70 మంది వాలంటీర్లతో బందోబస్తు నిర్వహించారు. వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పల్లె మీది చౌరస్తా నుండి ముంజంపల్లి మీదుగా వరంగల్ వైపు నుండి వచ్చే వాహనాలను మల్లించి నిమజ్జనానికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సిఐ మాదాస్ రాజకుమార్ పరిష్ఠమైన చర్యలు చేపట్టారు. ఈ వినాయక నిమజ్జనం వేడుకలకు రాష్ట్ర సాంస్కృతిక సారధి చైర్మన్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావుతో కలిసి చెరువు వద్ద గణేశునికి ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ క్రేను సహాయంతో వినాయక విగ్రహాన్ని చెరువులలో నిమజ్జనం చేసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మానకొండూరు చెరువులో గణేష్ నిమజ్జనం వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు విస్తృతమైన సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ సదుపాయాలను వినియోగించుకొని భక్తి భావంతో ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తాళ్ల పెళ్లి శేఖర్ గౌడ్, మానకొండూరు సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్, ఉపసర్పంచ్ నెల్లి మురళి,పిట్టల మధు, ఉండుంటి సామ్సన్,ఎమ్మెల్యే పిఆర్ఓ తిరుపతి గౌడ్, తాసిల్దార్ రాజు, రూరల్ ఏసీపి కరుణాకర్ రావు, సిఐ మాదాసు రాజకుమార్, తిమ్మాపూర్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు శ్రీకాంత్ గౌడ్, ప్రమోద్ రెడ్డి, ఏఎస్ఐ భాస్కరాచారి,ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.




