బీఆర్ఎస్ అభ్యర్థిపై బురదజల్లడం సరికాదు
జ్యోతితోనే గ్రామాభివృద్ది
బీఆర్ఎస్ తో నర్సింహారెడ్డికి సంబంధం లేదు
అవిశ్వాసానికి పూనుకున్న వార్డు సభ్యులు
ములుగు,సెప్టెంబర్ 27
ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిపై బురద జల్లడం సరికాదని కాల్వపల్లి గ్రామ వార్డు సభ్యులు అన్నారు.ములుగు జడ్పీ చైర్ పర్సన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేఅభ్యర్థి బడే నాగజ్యో తితోనే తమ గ్రామ అభివృద్ది చెందిందని వారు స్పష్టం చేశా రు.బీఆర్ఎస్ పార్టీ ఉప సర్పం చ్ అంటూ కాల్వపల్లి నుండి మాది రెడ్డి సంపత్ రెడ్డి ని ములుగు ఎమ్మెల్యేధనసరి అనసూయ కాంగ్రెస్ లో చేర్చు కోవడం హస్యస్పదమని అతని బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని 10 లక్షలు యిచ్చి ప్రలోబాలకు గురి చేస్తున్నదని వారు అన్నారు.ఈ సందర్బంగా కాల్వపల్లి గ్రామం లోని 8 మంది వార్డుసభ్యులు ములుగు ఆర్డీఓ సత్యపాల్ రెడ్డికి అవిశ్వాసం తీర్మాణం ప్రవేశపెట్టారు.ఈ కార్యక్రమంలో కాల్వపల్లి వార్డుసభ్యులు గోపనబోయిన విజయ, యాలం మురళీ,గోపనబో యిన మంజుల,నల్లముక్క శ్రీను,సిద్దబోయిన సులోచన, కుడుముల సారలక్ష్మీ,సిద్దబో యిన వెంకన్న,వెంకటేశ్వర్లు, ఉన్నారు.