Breaking News

శంకుస్థాపన

226 Views

రేపు నర్సంపేట మెడికల్‌ కళాశాలకు:మంత్రి హరీశ్​రావు శంకుస్థాపన

వరంగల్‌ జిల్లా:సెప్టెంబర్ 27

తెలంగాణలోనే తొలిసారిగా నర్సంపేట డివిజన్‌ కేంద్రానికి ప్రభుత్వం మంజూరు చేసిన మెడికల్‌ కళాశాలను రేపు గురువారం ఉదయం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి. హరీష్‌ రావు శంకుస్థాపన చేయనున్నారు.

స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి కృషి, ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవతో నర్సంపేటకు మెడికల్‌ కళాశాలను గత నెలలో మంజూరు చేశారు. రాష్ట్రంలో మొదటిసారిగా జిల్లా కేంద్రం కాని ప్రదేశానికి మంజూరు చేసిన తొలి మెడికల్‌ కళాశాలగా నర్సంపేట ప్రత్యేకతను సాధించుకుంది.

ఈ కళాశాలను నర్సంపేట మండల కేంద్రంలో ఏరియా ఆస్పత్రి సమీపంలో నిర్మించనున్నారు. మంత్రి హరీష్‌ రావు గురువారం ఉదయం 11.30గంటలకు శంకుస్థాపన చేస్తారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌, జిల్లాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీచైర్‌ పర్సన్‌లు పాల్గొంటారని ఆయన తెలిపారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *