ముస్తాబాద్,సెప్టెంబర్26 మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో గల సాకల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి128.వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈసందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాటం ఆదర్శ ప్రాయమని, తెలంగాణ కోసం ఆమె పోరాడిన స్ఫూర్తి మరువలేనిదని భావి తరాలకు ఆమె పోరాటం స్పూర్తి దాయకమని కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, తెలంగాణ మలిదశ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. భూమికోసం, భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసి రజాకార్ల గుండెల్లో గుబులు పుట్టించిన వీరనారని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన ఘనత చాకలి ఐలమ్మ దేనని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, సర్వర్ పాషా, అన్వర్, చిప్పలపల్లి సుద్దాల దేవయ్య, ఎంపీటీసీ కంచం మంజుల నర్సింలు, మెంగని మనోహర్, ప్రజా ప్రతినిధులు రజక సంఘం సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
