Breaking News

సింగరేణి కార్మికులకు దసరా కానుక

163 Views

సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కానుక

హైదరాబాద్:సెప్టెంబర్ 26

సింగరేణి కార్మికుల కు యాజమాన్యం శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సింగరేణి సంస్థలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన లాభాల వాటాల్లో 32 శాతం ఉద్యోగులకు ఇవ్వాలని నిర్ణయించింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు, గని కార్మికులకు దేశంలోనే అత్యధికంగా దసరా కానుక అందిస్తున్న రాష్ట్రంలో తెలంగాణ నిలిచింది.

తాజాగా 32 శాతం బోనస్ అందివ్వాలన్న నిర్ణయంపై ఎమ్మెల్సీ కవిత సీఎంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు*

కాగా ఇటీవలే 11వ వెజ్ బోర్డు బకాయిలు రూ.1450 కోట్లను సింగరేణి యాజమాన్యం కార్మికుల ఖాతాల్లో జమ చేసింది…

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *