ప్రాంతీయం

ఆజాద్ అంటే ఒక చరిత్ర భారత యువతకు ఆదర్శం

31 Views

ఆజాద్ అంటే ఒక చరిత్ర భారత యువతకు ఆదర్శం

చిత్రంతో నివాళులు అర్పించిన రామకోటి రామరాజు

సిద్దిపేట జిల్లా, గజ్వేల్ ఫిబ్రవరి 27

భారతమాత ముద్దుబిడ్డ ఆజాద్ చంద్రశేఖర్ వర్ధంతిని పురస్కరించుకొని ఆ విప్లవ వీరునికి చిత్రాన్ని సబ్బుబిళ్ళ మీద చిత్రాన్నిp అద్భుతంగా చిత్రించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ నీ పేరేంటి అని అడిగితే ఆజాద్ అని. నీ తండ్రి పేరేంటి అని అడిగితే స్వాతంత్రం అని, మీ ఇల్లు ఎక్కడ అని అడిగితే జైలు అని సగర్వంగా విప్లవ వీరుడు ఆజాద్ అన్నాడు. 24 ఏళ్ల వయస్సులోనే దేశంకోసం అమరుడైన మహా వీరుడు. ఆజాద్ అంటే అంటే చరిత్ర కాదు భారతీయo యువత త్యాగాలకు ప్రతిరూపం. 26 ఏళ్ల వయసులోనే స్వతంత్ర సంగ్రామంలో అడిగిడిన మహా వీరుడన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్