Breaking News

దేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా

120 Views

దేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా? భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం నడుస్తుందా

హైదరాబాద్:సెప్టెంబర్ 26

గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవుల్లో నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను తిరస్కరిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయం బిసి వ్య‌తిరేక పార్టీ బిజెపి అని మ‌రోసారి నిర్ధార‌ణ అయింద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

బ‌ల‌హీన వర్గాల ఎదుగుద‌ల‌ను క‌మ‌లం పార్టీ భ‌రించ‌లేద‌ని విమ‌ర్శించారు.. గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యంతో

బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని కవిత స్పష్టం చేశారు. శాసనమండలిలో నిర్వ‌హించిన చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులకు నామినేట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పంపించిన పేర్లను గవర్నర్ తిరస్కరించడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు.

దేశంలో భారత రాజ్యాంగం నడుస్తుందా?లేదా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం నడుస్తుందా? అన్న అనుమానం కలిగే విధంగా పలు రాష్ట్రాల్లో గవర్నర్లు ప్రవర్తిస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.

ప్రతీ రాజ్యాంగబద్ధమైన సంస్థకు ఉండే హక్కులు, పరిధులు వాటికి ఉంటాయనీ, అన్నింటినీ గమనిస్తూ ప్రజలను ఒక్కతాటిపై ముందుకు నడిపించాలన్న దాన్ని పక్కన పెట్టి గవర్నర్లు ఇలా వ్యవహరించడం దురదృష్టకరమని మండిపడ్డారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పేర్లను గవర్నర్ ఆమోదించే సంప్రదాయం ఉందని, దాన్ని విస్మరించి బీసీ వర్గాలకు నష్టం చేయడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *