(తిమ్మాపూర్ సెప్టెంబర్ 25)
తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో సోమవారం రెడ్డి కాలనీ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ఏర్పాటు చేసిన కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్య లో పాల్గొని భక్తిశ్రద్ధలతో కుంకుమ పూజ జరుపుకున్నారు. వేద పండితులు విజయ్ శర్మ సాంప్రదాయ బద్దంగా శాస్త్రృత్తంగా నిర్వహించారు. కుంకుమ పూజ ప్రాశస్త్యాన్ని మహిళలకు వివరించారు.
ఈ కార్యక్రమం లో రెడ్డి సంఘం నాయకులు,గణేష్ యూత్ సభ్యులు, మహిళలు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వినాయకుని ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.




