తెలంగాణ సెప్టెంబర్ 25:హైదరాబాద్ : అక్టోబర్ 24 నుండి సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం..
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలో దసరా కానుకగా వచ్చే నెల 24 నుండి సీఎం కేసీఆర్ బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించి విద్యార్థులకు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు అల్పాహారం అందించనున్నారు.
టిఫిన్ మెనూ
సోమవారం – గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగళవారం – బియ్యం రవ్వ కిచిడి, చట్నీ
బుధవారం – బొంబాయ్ రవ్వ ఉప్మా, సాంబార్
గురువారం – రవ్వ పొంగల్, సాంబార్
శుక్రవారం – మిల్లెట్ రవ్వ కిచిడి, సాంబార్
శనివారం – గోధుమ రవ్వ కిచిడి, సాంబార్
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్, మోడల్ స్కూల్స్ లోని మొత్తం 23,05,801 మంది విద్యార్థులకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు.




