– కరీంనగర్- వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో
కిషన్ రెడ్డి దీక్ష భగ్నం చేయడం హేయమైన చర్య
(మానకొండూర్ సెప్టెంబర్ 14)
మానకొండూర్ మండల కేంద్రంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ఆధ్వర్యంలో.. బుధవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగ భృతి చెల్లించాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఉపవాస దీక్ష చేపడితే ఆ దీక్షను కుట్రపూరితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసులతో భగ్నం చేయడాన్ని నిరసిస్తూ.. కరీంనగర్-వరంగల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి,ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మ దహనాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి మానకొండూరు నియోజకవర్గం ఇన్చార్జి గడ్డం నాగరాజు హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని ఇలాంటి చర్యలు పునారవృతమైతే మరిన్ని ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి గీత కార్మికుల జిల్లా కన్వీనర్ పూదరి రమణా గౌడ్, ఓబీసీ మోర్చ జిల్లా ఉపాధ్యక్షులు మియాపురం లక్ష్మణచారి, మండల ప్రధాన కార్యదర్శులు సొన్నాకుల శ్రీనివాస్, వంగళ ఆంజనేయులు, ఎస్టి మోర్చా జిల్లా కార్యదర్శి మొగిలి శ్రీనివాస్, బొమ్మరవెని మల్లన్న, బిజెవైంయం జిల్లా కార్యవర్గ సభ్యులు కాల్వ చిరంజీవి, మండల ఉపాధ్యక్షులు కత్తి ప్రభాకర్ గౌడ్, కంది రాజిరెడ్డి కార్యదర్శులు కనుకుంట్ల ఆంజనేయులు, చొప్పరి అశోక్ నాయకులు: భాషబోయిన ప్రదీప్ యాదవ్, ఆరెల్లి శ్రీహరి, ఎదులాపురం ఆశ్వన్ తేజ, బల్ల అంజి ముదిరాజ్, పిట్టల నరేష్ తదితరులు పాల్గొన్నారు.




