ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్సీ కవితకు శుభాకాంక్షలు
సెప్టెంబర్ 23
రాజ్యసభ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు పాస్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కవితను కలిసి ఎంపీ రవిచంద్ర పుష్పగుచ్ఛమిచ్చి శుభాకాంక్షలు చెప్పారు.మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ, ఇందుకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని గుర్తు చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.రవిచంద్రతో పాటు జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఎంపీ ఆర్.కృష్ణయ్య, బోర్లకుంట వెంకటేష్ నేతకాని,మాలోతు కవిత, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ,బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, సభ్యులు కిశోర్ గౌడ్, మున్నూరుకాపు సంఘం అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్థార్ పుటం పురుషోత్తం రావు తదితర ప్రముఖులు కవితకు తమ శుభాకాంక్షలు తెలిపారు
