యువత రాజకీయాల్లోకి రావాలి అప్పుడే సమాజంలో మార్పు – బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ రఘునాథ్ వెరబెల్లి.
ఈరోజు మంచిర్యాల పట్టణంలోని M కన్వేషన్ హాల్ లో మొదటి సారిగా ఓటు హక్కు వినియోగించుకునే యువతతో బీజేపీ మంచిర్యాల అసెంబ్లీ అభ్యర్థి రఘునాథ్ వెరబల్లి యువ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని రాజకీయాల్లో యువత పాత్ర పై వారికి వివరించడం జరుగుతుంది మరియు పలువురు యువతి యువకులు అడిగిన ప్రశ్నలకు రఘునాథ్ సమాధానం చెప్పడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యువత రాజకీయాల్లోకి తప్పక రావాల్సిన అవశ్యకత ఉందని యువత రాజకీయాల్లోకి రానంత వరకు కుటుంబ పాలన రాజ్యమేలుతుంది అని అన్నారు. మంచిర్యాల లో మార్పు, అభివృద్ది, యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతుల సమస్యలు పరిష్కారం, ప్రజల సమస్యలు పరిష్కారం మరియు మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఒక్క విజన్ ఉన్న నాయకుడు ప్రజల సంక్షేమ కోసం ఒక్క యువ నాయకుడు మంచిర్యాలకు అవసరం అన్నారు.
మంచిర్యాల మార్పు, అభివృద్ధికి, యువత ఉద్యోగాలకు నాది భరోసా అని హామీ అని ఈ ఎన్నికలో బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని అన్నారు.
