పాములపర్తి రామాలయంలో ఘనంగా గణపతి పూజలు
సెప్టెంబర్ 23
సిద్దిపేట జిల్లా మర్కుక్.మండలం పాములపర్తి రామాలయం లో మట్టి గణపతి నెలకొల్పి ఘనంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు శనివారం మర్కుక్ మండల ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి అర్థం లక్ష్మణ్ దంపతుల ఆధ్వర్యంలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు గణపతి విగ్రహ దాత ఇరుకుల రాజశేఖర్ గుప్త గణపతిని దర్శించుకుని రామాలయంలో పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇరుకుల రాజశేఖర్ గుప్త కు శాలువాతో సత్కరించి ప్రసాదం జ్ఞాపిక అందజేశారు
