(తిమ్మాపూర్ సెప్టెంబర్ 23)
మానకొండూర్ నియోజకవర్గంలో డీసీసీ జిల్లా అధ్యక్షులు కవ్వం పెళ్లి సత్యనారాయణ తలపెట్టిన గడపగడపకు కవ్వంపల్లి కార్యక్రమం తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో కొనసాగింది.
బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి ఎంత మేరకు జరిగిందని సంక్షేమ ఫలాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయి అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ యాత్ర చేస్తున్నారని అన్నారు.శనివారం తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో ఆయన గడపగడపకు తిరిగి ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు నిరుపేదలు ప్రభుత్వం నుండి తమకు ఎలాంటి సంక్షేమ పథకాలు చేరలేదని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తిమ్మాపూర్ మండలంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం పూర్తి కాలేదని, దళితులకు పూర్తిస్థాయిలో భూమి అందలేదన్నారు.
డబుల్ రోడ్డు నిర్మాణం కోసం యువజన సంఘాలు కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహించి, పాదయాత్ర చేయడం మూలంగానే విధిలేని పరిస్థితిలో జీవో జారీ చేశారన్నారు. చిత్తశుద్ధితో ఆరు నెలల్లో డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ ప్రభుత్వం యువకులను మోసం చేసిందన్నారు. నేను గతంలో తిమ్మాపూర్ జడ్పీటీసీగా పనిచేసి సొంత ఖర్చుతో తిమ్మాపూర్ మండలంలో బోర్లు, సిసి రోడ్లు వేసానాని తెలిపారు.మొన్న నుస్తులపూర్ లో జరిగిన సభలో రసమయి బాలకిషన్ నాపై మాట్లాడిన మాటలకు అదే నుస్తులపూర్ స్టేజి పైన రసమయి బాలకిషన్ చిందులు చిందు చిందు చేసి చిత్తడి చేసి అతనిని మెదక్ కు తరిమి కొడతామని ఆగ్రహం వ్యక్తం చేశారు.తిమ్మాపూర్ మండల ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీ గెలిపించాలన్నారు.
ఈ సందర్భంగా కవ్వంపల్లి సమక్షంలో కాంగ్రెస్ పార్టి లో చేరిన మాజీ సర్పంచ్ వేల్పుల విజయ్, తాళ్లపల్లి రాజయ్య తో పాటు మరికొందరు బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు..