రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ కాలనీవాసులు చాలాకాలంగా ఎదుర్కొంటున్న విద్యుత్ లో వోల్టేజీ సమస్యను పరిశీలించడానికి ఆ ఏరియాలో వారం రోజులలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు సర్వం సిద్ధం చేశామని సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి తెలిపారు.
శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సెస్ డైరెక్టర్ వరుస కృష్ణహారి మాట్లాడుతూ విద్యుత్తు సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం కోసం వినియోగదారులకు అందుబాటులో మండల కేంద్రంలో సెస్ సబ్ డివిజన్ కార్యాలయాన్ని కూడా త్వరలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకపోతున్నట్లు ఆయన ప్రకటించారు.
