రాజకీయం

మద్యం దుకాణాల కేటాయింపులకు విస్తృత ఏర్పాట్లు

136 Views

ఈ నెల 20న మద్యం దుకాణాల కేటాయింపుకు చేపట్టే లక్కీ డ్రా ప్రక్రియకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ గురించి సమావేశ మందిరంలో, కార్యాలయ ఆవరణలో చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో లక్కీ డ్రా ఏర్పాటుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. ఎంత మంది హాజరవుతారో అంచనాకు 10 శాతం అదనంగా కుర్చీలు ఏర్పాటుచేయాలన్నారు. కార్యాలయాల్లో రోజువారి కార్యకలాపాలకు ఆటంకం లేకుండా ప్రక్రియలో పాల్గొనే వారి ప్రవేశం, నిష్క్రమణ ఉండాలన్నారు. వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. త్రాగునీరు, కనీస మౌళిక సౌకర్యాలు చూడాలన్నారు. పాల్గొనే దరఖాస్తుదారులు డిపాజిట్ మొత్తం చెల్లించుటకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. దరఖాస్తుదారులు, సహాయకులు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ అన్నారు. కోవిడ్ నియంత్రణా చర్యల్ని పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించేలా చూడాలని, సానిటైజర్ అందుబాటులో ఉంచాలని అన్నారు. పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం ఆయన కార్యాలయ మొదటి అంతస్తులో మద్యం దుకాణాల కోసం అబ్కారీ శాఖ సిబ్బంది స్వీకరిస్తున్న దరఖాస్తుల కౌంటర్లను పరిశీలించారు. ఇప్పటివరకు అభ్యర్థుల నుండి ఎన్ని దరఖాస్తులు వచ్చాయని సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సిరిసిల్ల డిఎస్పీ పి. చంద్రశేఖర్, ఎక్సైజ్ సిఐలు ఎంపీఆర్. చంద్రశేఖర్, రాము, ఎల్డిఎం రంగారెడ్డి, కలెక్టరేట్ ఏవో గంగయ్య, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7