*డబుల్ బెడ్ రూములు అమ్ముకున్న ఘనత మంత్రిదే : వైఎస్అర్*
*ఘట్ కేసర్ ఎంపీపీ వైయస్సార్ అరెస్ట్*
*???? అడ్డుకుంటాంమని భయంతో ముందస్తు అరెస్టు*
*???? మొదటి విడత లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గారిని నిలదీశారని ముందస్తు అరెస్టు*
*???? నియంత పాలనకు నిదర్శనమే ఈ అరెస్టులు*
*???? కక్షపూరిత రాజకీయాలు మానుకోండి*
*???? మంత్రి అసమర్థత వలన స్థానికేతరులకు డబల్ బెడ్ రూమ్లు*
*???? డబల్ బెడ్ రూమ్లో అమ్ముకున్న ఘనత మంత్రి మల్లారెడ్డికి దక్కుతుంది*
*???? స్థానిక ప్రజాప్రతినిధులకు, బిఆర్ఎస్ నాయకులకు సిగ్గు శరం ఉంటే కార్యక్రమంలో పాల్గొనే వారు కాదు*
*ఇదే నిజం, మేడ్చల్ నియోజకవర్గం :*
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మండలం ఔషపూర్ గ్రామంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షులు, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షులు, ఘట్ కేసర్ మండల ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డిని నివాసంలో పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రత్యక్షంగా ఏమి చేయలేమనే భయంతోనే భయటకు రాకుండా అరెస్టు చేయిచడం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకుల చేతగాని తననికి నిదర్శనం. మొదటి విడత ప్రారంభోత్సవాలు డిప్యూటీ స్పీకర్ పద్మారావుని నిలదీశారని ఈ కక్షపూరిత రాజకీయాలు దురుద్దేశంతోనే గురువారం రోజు ముందుగానే అరెస్ట్ చేశారని వాక్ పోయారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి మల్లారెడ్డి అసమర్థత వలనే స్థానికేతరులకు అందజేశారని డబల్ బెడ్ రూంలో అమ్ముకున్న ఘనత మంత్రి మల్లారెడ్డిదేనని, స్థానిక ప్రజాప్రతినిధులకు, బిఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొనే వారు కాదని ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ ఉన్న పోలీసులు వెళ్ళనివ్వకుండా మాయమాటలు చెప్పి దౌర్జన్యంగా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులను ప్రజల కోసం ప్రజా సమస్యల కోసం పనిచేయాలని బిఆర్ఎస్ ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయవద్దని సూచించారు. ప్రజలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పై విసిగి ఉన్నారని వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపిస్తారని మీడియా ద్వారా తెలియజేశారు.
