ప్రాంతీయం

రైతు నల్ల చట్టాలను రద్దు చేసినందుకు హర్షం వ్యక్తం చేసిన టిఆర్ఎస్ శ్రేణులు

212 Views

కేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పై విధించిన నల్ల చట్టాలను రద్దు చేసుకున్నందుకు హర్షిస్తూ ఎల్లారెడ్డిపేట మండల టిఆర్ఎస్ పార్టీ కమీటీ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు శుక్రవారం టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు
ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వరుస కృష్ణ శహరి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోనీ పాత బస్టాండ్ లో టపాసులు. పేల్చి అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల పక్షపాతి అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మోడీ ప్రభుత్వం యాసంగి వరి పంట కొనడం పై స్పష్టత ఇవ్వాలని రైతుల పై విధించిన నల్ల చట్టాలను రద్దు పర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ నియోజకవర్గాలలో రైతు ధర్నా కార్యక్రమాలను పిలుపునివ్వటం అదేవిధంగా హైదరాబాద్ ధర్నా చౌక్ గురువారం రైతు మహా ధర్నా కార్యక్రమం నిర్వహించడం అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ నల్లుల చట్టాలను రద్దు చేసుకునే వరకు ధర్నా కార్యక్రమాలు చేపడుతూ నే ఉందని అవసరమైతే ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించడంతో దిగి వచ్చిన కేంద్ర మోడీ ప్రభుత్వం శుక్రవారం నల్ల చట్టాలను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిందని ఆయన గుర్తు చేశారు ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నట్లు రాష్ట్ర రైతాంగం కూడా సంతోషం వ్యక్తం చేస్తోందని ఆయన ప్రకటించారు రైతుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరించే ప్రభుత్వాలు నిలువలేనని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల రైతు అధ్యక్షులు గోగూరి ప్రదీప్ రెడ్డి .ఎల్లారెడ్డిపేట సింగల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి మాట్లాడారు
ఈ సమావేశంలో. ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ ఉపాధ్యక్షులు కదిరి భాస్కర్ గౌడ్.టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పిల్లి కిషన్. ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీ ఎలగందుల అనసూయ నర్సింలు.మండల కో ఆప్షన్ మెంబర్ జభ్భర్. మాజీ కోఆప్షన్ హాసన్ బాయి. టిఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బండారి బాల్ రెడ్డి.టిఆర్ఎస్ పార్టీ మండల మహిళా అద్యక్షురాలు మహామ్మద్ అప్సరా ఓన్నీషా అజ్జు. ఎస్సీసెల్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎడ్ల సందీప్. టిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు ఎడ్ల లక్ష్మణ్ . ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు సీత్యానాయక్. మాజీ అద్యక్షులు అజ్మీర రాజు నాయక్ .యూత్ అద్యక్షులు దొనుకుల కళ్యాణ్. కార్యదర్శి గడ్డం వెంకటేష్. వెంటేష్. ముష్కం గౌడ్. టిఆర్ఎస్ పార్టీ నాయకులు దేవేందర్. టిఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు మహిళా ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఆయా గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7