త్వరలో నెరవేరానున్న మల్లంపల్లి మండల ఆకాంక్ష
పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు
ములుగు జిల్లా,సెప్టెంబర్ 20
బీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసా గుతున్నాయి.బుధవారం ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్ ఆధ్వ ర్యంలో ములుగు పట్టణానికి చెందిన సుమారు వందమంది బిజెపి కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీలో చేరారు.వీరికి జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా లక్ష్మణ్ బాబు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టిఆర్ ఎస్ పార్టీలో చేరారని తెలి పారు.దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని అన్నారు.స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధిని పట్టించు కోకపోయినా సీఎం కేసీఆర్ ములుగు జిల్లా పై ప్రత్యేక దృష్టి పెట్టి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తు న్నారని అన్నారు.ఏళ్ల తర బడిగా మండల ఆకాంక్షల మేరకు అక్కడి ప్రజలు చేస్తున్న పోరాట పటిమలు గుర్తించిన సీఎం కేసీఆర్ త్వరలోనే మల్లం పల్లిని మండలం చేసి వారి ఆకాంక్షను నెరవేర్చే రోజు దగ్గరలోనే ఉన్నదని అన్నారు. ములుగును జిల్లాగా ఏర్పాటు చేసి కోట్ల రూపాయల నిధుల ను కేటాయించి సమీకృత కలెక్టరేట్ భవనం,మెడికల్ యూనివర్సిటీ,మెడికల్ హబ్, రవాణా కార్యాలయం వంటి వాటిని ఏర్పాటు చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో
మండల పార్టీ అధ్యక్షుడు బాదం ప్రవీణ్,పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్,పార్టీ సీనియర్ నాయకులు మల్క రమేష్ మేర్గు సంతోష్ ఎంపీటీసీ లు లాలూ,సత్యనారాయణ,గొర్రె సమ్మయ్య,సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు భూక్యా పాప పవన్,యాకుబ్,రూప్ సింగ్,కోగిల మహేష్,బికని సాగర్,తదితరులు పాల్గొన్నారు..




