సిద్ధిపేట సెప్టెంబర్ 20
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని సీఎం కేసీఆర్ లాగా మాట ఇచ్చి తప్పుకోవడం కాదని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట పట్టణ అధ్యక్షుడు అన్నారు. సిద్దిపేటలో బుధవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ తుక్కుగూడ సభలో 6 పథకాలకు గ్యారెంటీ స్కీం లక్షలాది మంది సాక్షిగా ప్రకటించారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిందంటే వెన్నుతిరిగేది ఉండదని అది ఏది ఏమైనా చేసి తీరుతుందని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాగుండాలని ఆకాంక్షతో సోనియాగాంధీ నాడు రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్నారని సోనియా గాంధీ తల్లి స్థానంలో ఉండి రాష్ట్ర ఏర్పాటును ప్రకటించారని అన్నారు. అలాంటి రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని అనుకుంటే సీఎం కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజలను రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆరు గ్యారెంటీ స్కీము పథకాలు ప్రకటిస్తే బిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేక మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారు అని అన్నారు. సిద్దిపేట పట్టణంలో దళిత బందు బీసీ బందు కింద మంజూరైన నిధులను కోమటి చెరువు కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ అభివృద్ధి కంటే ముందు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ముఖ్యమని అన్నారు. బిఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గరలో పడ్డాయని మహిళలు యువత ప్రజలు అందరూ ఆలోచించి వచ్చే ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటును వేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ స్కీములను తప్పకుండా అమలు చేస్తుందని బిఆర్ఎస్ పార్టీ లాగా ఒక హామీ ఇచ్చి మరోలా వ్యవహరించాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రవేశపెట్టిన పథకాలకి పేరు మార్చి అమలు చేస్తున్నారు తప్ప తొమ్మిదేళ్ల పాలనలో సీఎం కేసీఆర్ చేసింది ఏమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట్ పట్టణ ప్రధాన కార్యదర్శి గ్యాదర్ మధు. సిద్దిపేట పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గయాజుద్దీన్ ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ రాశాద్ సిద్దిపేట మైనార్టీ పట్టణ అధ్యక్షులు సలీం. నవాజ్ తదితరులు పాల్గొన్నారు
