– బీ.ఆర్.ఎస్ పార్టీలోకి జోరుగా వలసలు
– కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే
(శంకరపట్నం సెప్టెంబర్ 20)
మానకొండూర్ నియోజకవర్గం శంకరపట్నం మండలంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు ఖాళీ అవుతుంది. సీఎం కేసీఆర్ పాలనకు తమ సంపూర్ణ మద్దతు పలుకుతూ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేపట్టిన అభివృద్ధికి అండగా నిలుస్తూ గులాబీ గూటికీ భారీగా చేరికలు ఉపందుకున్నాయి.
బుధవారం శంకరపట్నం మండలం బీ.ఆర్.ఎస్.పార్టీ కార్యాలయంలో ముత్తారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా బీ.ఆర్.ఎస్ పార్టీలో చేరగా, ఎమ్మెల్యే రసమయి వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు..




