దౌల్తాబాద్: సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలోని అల్లాదుర్గం సాక్షి విలేకర్ వీరేందర్ పై దాడి చేసినా అల్లాదుర్గం ఎంపిపి అనిల్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం దౌల్తాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడుతూ. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తావని దుర్భాషలాడి విలేకరు వీరేందర్ పై దాడి చేసిన ఎంపీపీ అనిల్ రెడ్డిని తక్షణమే అరెస్టు తగిన చర్యలు తీసుకోవాలని మండిపడ్డారు. విలేకరులు ఏదైనా వార్త రాస్తే తప్పు ఒప్పును ఖండించాలి తప్ప విలేకరులపై దాడులు చేయడం పత్రిక స్వేచ్ఛను ఆరించడమేనని అన్నారు. ఎంపీపీ అనిల్ రెడ్డి పై చర్యలు తీసుకోకపోతే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లింగాల రాజిరెడ్డి, ప్రెస్ క్లబ్ సభ్యులు.శంభు లింగం, సంతోష్, నగేష్, బాబు, భాస్కర్ గౌడ్,యాదగిరి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.
