సిద్దిపేట లో కత్తి పోట్ల కలకలం
వ్యక్తి పై మారాణాయుధాలతో దాడి, గాయపడ్డ వ్యక్తి ని ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించిన పోలీసులు
గాయపడ్డ వ్యక్తి ఆలేరు వాసిగా గుర్తింపు
సెప్టెంబర్ 20
సిద్దిపేట:- వివరాల్లోకి వెళితే సిద్దిపేట లో హౌసింగ్ బోర్డు కాలనీ లో కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడికి గురైన సాయి కిరణ్ సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నాడు, యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన సాయి(25) కి, సిద్దిపేట యువతి స్నాప్ చాట్ లో పరిచయం అయ్యారు. ఒకరినొకరు ప్రేమించుకోగా మాట్లాడుకుందాం రా అంటూ ప్రియురాలు ఇంటికి పిలిచింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె బావ, బందువులు కత్తి తో మెడపై దారుణంగా దాడి చేసారు… వెంటనే అతడిని సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించి. అక్కడ సీరియస్ గా ఉండటంతో హైదరాబాద్, గాంధీ కి తరలించారు..





