రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో మహిళలు గోమాతకు ఘనంగా సీమంతం చేసి అందరి ప్రసంశలు అందుకున్నారు
హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాతలో మూడు కోట్ల దేవతలు ఉంటారని, గోవును పూజించడం వల్ల మంచి జరుగుతుందని వారి విశ్వాసం, ఇది అరుదైన సందర్భం
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మిరియాల్కర్ రమణ కిషన్ దంపతులు పెంచుకుంటున్న గోమాతకు గర్భం దాల్చి తొమ్మిదో నెలలు అయినందున గాంధీ ఏరియా కు చెందిన మహిళలు సీమంతం చేశారు.
ఏకాదశి కార్తీక సోమవారం మంచి రోజని భావించిన మహిళలు గోమాతకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. గోమాతకు పూలమాలలు వేసి పత్యేకంగా అందంగా అలంకరించారు. అనంతరం గోమాత కు ఫలహారాలతో పాటు పండ్లు. పూలు, గాజులు, చీరలు, పసుగ్రాసం మంగళహారతులు సమర్పించి గోమాతకు పత్యేకపూజలు చేశారు.
నైవేద్యం సమర్పించి మంచి జరగాలని కోరుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గాంధీ ఏరియాకు చెందిన శ్యామ మంజుల. రేవూరి రామలక్ష్మి- లక్ష్మీనారాయణ గుప్తా. యమగొండ పద్మ -కృష్ణారెడ్డి. నరసింహారెడ్డి- పద్మ . గోషిక శోభా -దేవదాసు. రాధా- సుదర్శన్. మిరియాల్కర్ రమణ-కిషన్ .వడ్నాల లక్ష్మణ్ -నరసవ్వ . వడ్నాల రామస్వామి- లక్ష్మి. ఆడెపు శోభా
– నగేష్ .వడ్నాల కిషన్- సునీత. చారి- చంద్రకళ. మేగి నరసయ్య -వరలక్ష్మి. దంపతులు సీమంతం వేడుకల్లో పాల్గొన్నారు. ఒక వర్గం అత్తింటివారిగా ఒక వర్గం పుట్టింటివారుగా విభజించుకుని సీమంతం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు తీర్థప్రసాదాలు స్వీకరించారు.





