(తిమ్మాపూర్ సెప్టెంబర్ 17)
లారీ అద్భుతప్పి బోల్తా కొట్టిన సంఘటన తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది..
కరీంనగర్ నుండి హైదరాబాదుకు అతి వేగంగా వెళుతున్న లారీ తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది..
ఈ సంఘటనలో లారీ డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కొని అర్తనాదాలు పెట్టడంతో అటుగా వెళుతున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీస్ సిబ్బంది తో సంఘటన స్థలానికి చేరుకున్న తిమ్మాపూర్ ఏఎస్ఐ నిజాముద్దీన్ గొల్లపల్లి గ్రామ యువకుల సాయంతో లారి డ్రైవర్ ను బయటకు తీసి అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు…